సూర్యాపేట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని సస్పెండ్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నమేనని శుక్రవారం అన్నారు . రాష్ట్ర ప్రజలు, రైతులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన జగదీశ్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సూర్యాపేటలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.