సూర్యాపేటలోని 12వ వార్డు పిల్లలమర్రిలో బ్రిడ్జి లేక చెరువు అలుగు పోసినప్పుడు ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను శనివారం మంజూరు చేశారు. బ్రిడ్జి పనిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నాణ్యతతో కట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.