సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఐటి హబ్ ఇండస్ట్రియల్ పార్కులు పునరుద్ధరించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఐటీ హాబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికలకు ముందు లాంఛనంగా ప్రారంభించింది. ఎన్నికలలో ప్రభుత్వం మారడంతో నూతన ప్రభుత్వానికి ప్రాధమ్యాలు మారిపోవడంతో ఐటి హబ్ పూర్తిగా గాలికి వదిలేసినట్లయింది.