సువేన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సూర్యాపేటకు చెందిన బానోత్ బాబునాయక్ (50) మంగళవారం ఫ్యాక్టరీలో పని ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ గోదాం వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో బాబునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.