సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని ఐరిస్ ఒలంపియాడ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలను శుక్రవారం జరుపుకున్నారు. విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులను ధరించి సంక్రాంతి సంబురాలను అట్టహాసంగా స్కూల్లో భోగి మంటలను ఏర్పాటు చేశారు. స్కూలు ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మన్నెం మురళీధర్, హెడ్మాస్టర్ బి అనసూయ, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి భోగిమంటలను వేశారు.