క్యాబ్ డ్రైవర్లు కలసి కట్టుగా ఉండి ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఐఎన్టియుసి అనుబంధం లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.