సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లైన్స్ క్లబ్ సూర్యాపేట కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మై అనే యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగి వేధింపుల వల్ల మృతి చెందిందని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైద్యశాల ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.