సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత పాలకులు గ్రంథాలయాలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మండలంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.