Oct 19, 2024, 09:10 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
పాఠశాలలో ఘనంగా పేరెంట్స్ మీటింగ్
Oct 19, 2024, 09:10 IST
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం హెడ్మాస్టర్ విమల కుమారి ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి స్కూలుకు పంపించేలా తగు చర్యలు తీసుకోవాలని, వారి మంచి ఉన్నత చదువులు చదివించేలా ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు.