నివేదిక వచ్చిన తర్వాతే 'రైతు భరోసా': మంత్రి తుమ్మల

69చూసినవారు
నివేదిక వచ్చిన తర్వాతే 'రైతు భరోసా': మంత్రి తుమ్మల
మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత రాబోయే సీజన్‌ నుంచి రైతుభరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ బీఆర్కేఆర్‌ భవన్‌లో మీడియా సమావేశంలో రైతు బీమా, రుణ మాఫీ, రైతు భరోసా, ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు కనీస మద్దతు ధర, ఇతర వ్యవసాయ అంశాల గురించి మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్