సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల శివారు పాలేరు వాగులో సంపేట పున్నమ్మకు చెందిన వ్యవసాయ మోటారు విద్యుత్ తీగను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎర్ర పహాడ్ కు చెందిన మరో ఐదుగురి రైతుల మోటార్ల విద్యుత్తు తీగలు దొంగిలించారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్రనాథ్ తెలిపారు.