డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తూ అవమానపరిచిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలో ఎక్స్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కడెం లింగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు.