తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులే అని చట్టం నుండి తప్పించుకోలేరు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ పై ఎఫ్. ఐ. ఆర్ నమోదు అవ్వడం పట్ల అద్దంకి దయాకర్ గురువారం స్పందించారు. కేటీఆర్ పై కేసు నమోదు అవ్వడం సాధారణమే అని ఆయన తెలియజేశారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని, కేటీఆర్ పై నేరుగా నిధుల దుర్వినియోగం అభియోగం ఉందన్నారు.