అంబేద్కర్ పేరు ఎత్తితేనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భయపడుతున్నాడని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ను అవమానిస్తుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని కేంద్ర మంత్రిగా ఉండడానికి అమిత్ షా అర్హుడు కాడని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.