సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ పురస్కరించుకొని బుధవారం పెద్దమ్మతల్లి యూత్ ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి తెడ్డు కృష్ణారావు సహకారంతో గ్రామస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విలేజి విక్టరీ యూత్, ఎస్ఎస్సి 2023 -2024 బ్యాచ్ ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.