గురుకుల పాఠశాలలకు తాళాలు
తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలు నిర్వహిస్తున్న భవన యజమానులు తాళాలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు బిల్డింగ్ యజమానులు తాళాలు వేస్తున్నారు. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్ నగర్ లో పాఠశాలలు, వసతి గృహాలకు బిల్డింగ్ యజమానులు తాళాలు వేశారు.