నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పని చేసిన వారిని గుర్తించాలన్నారు. వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టాలని సూచించారు.