TDP నేత దంపతులపై దాడి.. భార్య మృతి

11840చూసినవారు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ భాస్కర్‌ రెడ్డి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ప్రత్యర్థులు కళ్లల్లో కారం చల్లి బండ రాయితో కొట్టినట్లు సమాచారం. ఈ దాడిలో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందింది. భాస్కర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అఖిలప్రియకు శ్రీదేవి సన్నిహితురాలని సమాచారం. ప్రభుత్వాసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్