ఏపీ వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేలా ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయనున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మండల కేంద్రాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాటు చేస్తామన్నారు. పాయకరావుపేటలో వివిధ శాఖల అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. అక్రమ లేఔట్లు, పేదల భూములు ఆక్రమించేలా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.