గత ఏడాది తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'దాదా'. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాను తెలుగులో పా..పా.. పేరుతో డబ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కాగా డిసెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.