అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి చిత్ర యూనిట్ ఓ అప్ డేట్ ఇచ్చింది. సినిమా ట్రైలర్‌ని జనవరి 28న లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.