ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

69చూసినవారు
ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య
TG: నిజామాబాద్ జిల్లా, బాన్సువాడలోని నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ భార్య తాళి కట్టిన భర్తను అతి కిరాతకంగా చంపింది. పోలీసుల కథనం ప్రకారం… జనవరి 21న భర్త కనిపించట్లేదని భార్య ఫిర్యాదు చేసిందని, అనుమానంతో భార్యను విచారించగా.. అసలు కథ బయట పడిందన్నారు. ప్రియుడితో కలిసి భర్తకు ఫుల్‌గా తాగించి, మత్తు వచ్చాక కాళ్లు చేతులు కట్టేసి హత్య చేసినట్లు వెల్లడించారు. తర్వాత మృతదేహాన్ని గ్రామంలోని సోమేశ్వర ఆలయం వెనుక పడేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్