టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు

56చూసినవారు
టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు
ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ మరోసారి వాహనాల ధరల పెంపునకు సిద్ధమైంది. వాణిజ్య వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 2 శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్