బీఆర్ఎస్ పై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

188439చూసినవారు
బీఆర్ఎస్ పై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
6 నెలలుగా ఎంతో మనసిక క్షోభకు గురవుతున్నానని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నాను. నాకు చేసిన అవమానం మానసిక వేదనను, భరించలేని బాధను కలిగించింది. ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చక రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. త్వరలో కేసీఆర్‌కు నా రాజీనామా లేఖ పంపిస్తా. నాకు టికెట్ ఇవ్వకపోవడం మాదిగ సామాజికవర్గ అస్తిత్వం మీద దెబ్బపడింది' అన్నారు.

సంబంధిత పోస్ట్