పోలీసుల ఎదుటే కొట్టుకున్న ఆకతాయిలు.. వీడియో వైరల్

58చూసినవారు
యూపీలోని బారాబంకిలో రెండు గ్రూపులకు చెందిన ఆకతాయిలు రెచ్చిపోయారు. పోలీసులు ఉన్నారనే భయం లేకుండా వారి ఎదుటే నడి రోడ్డుపై గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపంచుకున్నారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు వారిని అదుపుచేయలేక మిన్నకుండిపోయారు. ఆనంతరం సదరు పోలీసులు.. అదనపు బలగాలను పిలిపించి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్