AP: ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. ఓ పాఠశాల సెన్స్ టీచర్ వెంకట రంగారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధిత బాలిక బంధువులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట రంగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.