ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ 34 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును అనుసరించి డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ(సివిల్, ఎలక్ట్రికల్), ఎంఫిల్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు ఆఫ్‌లైన్ పద్దతిలో అప్లయ్ చేసుకోగలరు. వివరాలకు https://www.iitk.ac.in/new/recruitment సందర్శించగలరు.