ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఖోఖో ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ (14) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం కోసం పాఠశాలలో ఆటలు ఆడిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు బన్నీకి గతంలో గుండె సంబంధిత చికిత్స చేసి స్టెంటు వేసినట్టు సమాచారం.