ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి, అవకాశాలను అన్వేషించే మార్గాలు తదితర అంశాలపై చర్చించారు.