స్వ‌దేశానికి పయ‌న‌మైన సీఎం చంద్ర‌బాబు బృందం

50చూసినవారు
స్వ‌దేశానికి పయ‌న‌మైన సీఎం చంద్ర‌బాబు బృందం
AP: సీఎం చంద్ర‌బాబు బృందం దావోస్ నుంచి ఏపీకి తిరుగు ప‌య‌న‌మైంది. మ‌రికాసేప‌ట్లో జ్యూరిచ్ విమానాశ్ర‌యం నుంచి సీఎం చంద్ర‌బాబు బృందం స్వ‌దేశానికి రానుంది. దావోస్ స‌ద‌స్సు ద్వారా ప్ర‌పంచ వేదిక‌పై ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను చంద్ర‌బాబు బృందం ప‌రిచ‌యం చేసింది. ప్ర‌భుత్వ పాల‌సీలు, అవ‌కాశాలు, ఆలోచ‌న‌ల‌ను సీఎం బృందం ఐటీ సంస్థ‌ల‌కు వివ‌రించింది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు దిగ్గజ కంపెనీల‌ను ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్