దక్షిణ కొరియా కీలక నిర్ణయం

73చూసినవారు
దక్షిణ కొరియా కీలక నిర్ణయం
దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లోని రన్‌వేల సమీపంలో కాంక్రీట్‌ గోడలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు వెలువరించింది. రక్షణ గోడల స్థానంలో.. ప్రమాదవశాత్తు ఏదైనా ఢీ కొట్టినా విచ్ఛిన్నమయ్యేలా సురక్షితమైన నిర్మాణాలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గతేడాది డిసెంబరులో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్