పోరాటాలకు పురిటి గడ్డ తెలంగాణ: పవన్ కళ్యాణ్

69చూసినవారు
పోరాటాలకు పురిటి గడ్డ తెలంగాణ: పవన్ కళ్యాణ్
తెలంగాణ దశాబ్ది వేడుల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 60 ఏళ్లు ఎదురుచూశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ధ కాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోరాటాలకు పురిటి గడ్డ అయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. ఇక్కడ గాలిలో, నేలలో, మాటలో చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్