తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

60చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో పదేళ్లు పూర్తయింది. ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర అధికార గీతం 'జయ జయహే తెలంగాణ'ను ఆవిష్కరించి.. రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

సంబంధిత పోస్ట్