ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక గ్రామంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి పికప్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వ్యాన్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.