తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. నిరసనకారులు నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించారు.