భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు కాల్వ ఒడ్డు ప్రాంతంలో ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.