జమ్మూకశ్మీర్‌లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదుల దాడి.. CRPF ఇన్‌స్పెక్టర్ మృతి

53చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదుల దాడి.. CRPF ఇన్‌స్పెక్టర్ మృతి
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ CRPF ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. ఉధంపూర్ జిల్లాలో జమ్మూకాశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్, జాయింట్ పార్టీపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక CRPF ఇన్‌స్పెక్టర్ మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత వారం దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్