6 వేల మందిపై టెస్లా వేటు

80చూసినవారు
6 వేల మందిపై టెస్లా వేటు
ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. తాజాగా గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గజం టెస్లా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. టెక్సాస్‌, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ యోచిస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. వాహ‌న విక్రయాలు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్