సీఏ కోర్సు బాలికలకు ఒక వరం

67చూసినవారు
సీఏ కోర్సు బాలికలకు ఒక వరం
సీఏ కోర్స్ చదివే బాలికలు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. 2021, 2022, 2023 సంవత్సరాలలో జరిగిన సీఏ పరీక్షల్లో 75 మంది బాలికలు టాపర్స్ గా నిలిచారు. వివిధ రంగాల్లో మాదిరిగానే చార్టర్డ్ అకౌంటెన్సీ రంగంలోనూ భారతీయ మహిళలు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. 2023లో రికార్డు స్థాయిలో 43 % మంది బాలికలు CA పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 2000 సంవత్సరములో CAలు బాలికలు 8% ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 43% వరకు పెరిగింది. 8,63,000 మంది CA చదివే విద్యార్థుల్లో 43% బాలికలే ఉన్నారు. ప్రపంచంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో 47% భారత్‌లోనే జరుగుతున్నందున, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణుల అంచనా. ఈ రంగంలో ఫ్రెషర్స్ కు వార్షిక వేతనం రూ.12.5 లక్షల వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్