TG: ఘోర ప్రమాదం.. 10 మందికి గాయాలు

76చూసినవారు
TG: ఘోర ప్రమాదం.. 10 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం(D) కందుకూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నందిపాడు బైపాస్ వద్ద రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్