ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. సాయంత్రం ఒక్కసారిగా వాన దంచికొట్టింది. దీంతో కల్లాల్లోని వరి తడిసిముద్దయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మెదక్ జిల్లా రామాయంపేట మార్కెట్ యార్డులోధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ భీంగల్లో కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రనికి తెచ్చి నెల రోజులు కావొస్తున్నా కొనకపోవటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన చెందుతున్నారు.