తెలంగాణలో న్యూ ఇయర్ వస్తుందన్న సంతోషంతో మందుబాబులు మత్తులో మునిగితేలారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో 31st రోజున రికార్డ్ స్థాయిలో రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. DEC 28 నుంచి JAN 1 ఉదయం వరకు ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ గణాంకాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు పేర్కొంది. బుధవారం కూడా సెలవు కావడంతో రాత్రి వరకు మద్యం అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.