తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పోచారం మండలం ప్రతాప్ సింగారంలో శనివారం భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త రామకృష్ణ చారి, భార్య విజయలక్ష్మి ఇంట్లో విద్యుత్ తీగలు పట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారు. విద్యుత్ తీగలు పట్టుకున్న భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.