స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన థాయ్‌లాండ్

60చూసినవారు
స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన థాయ్‌లాండ్
స్వలింగ సంపర్కుల వివాహాలపై థాయ్‌లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయ్‌లాండ్‌ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా, ఆసియాలో గే వివాహాలను చట్టబద్ధం చేసిన మూడో దేశంగా అవతరించింది. నేపాల్, తైవాన్ ఇప్పటికే గే వివాహాలను అనుమతించగా థాయ్‌లాండ్‌లో నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్