ఆశ్చర్యం లేదా భావోద్వేగానికి గురైనప్పుడు రోమాలు నిక్కబొడుచుకోవడాన్ని గూస్‌బంప్స్ అని పిలుస్తారు. ఇది ‘ఎరక్టర్ పిలి’ అనే కండరాలు సంకోచించడం వల్ల జరుగుతుంది. చలిగా అనిపించినప్పుడు, భయం, ఆనందం, లేదా ఉద్వేగం వల్ల మెదడు శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో రక్తం వేగం పెరిగి చర్మ కండరాలు బిగుసుకుని రోమాలు పైకి లేస్తాయి. ఇది కేవలం మనుషులకే కాక.. మరెన్నో జీవులలో కూడా కనిపిస్తాయి.