AP: రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను నివారించడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో మొత్తం 311 మంది ఉత్తీర్ణత సాధించగా… వారందరికీ మార్చి 2న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను జైళ్ల శాఖ అధికారులు పూర్తి చేశారు.