అదే నా ముందున్న లక్ష్యం: గంభీర్‌

63చూసినవారు
అదే నా ముందున్న లక్ష్యం: గంభీర్‌
టీమిండియా ప్రధాన కోచ్‌గా తనను నియమించడంపై గంభీర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘భారతదేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. వేరే క్యాప్‌ పెట్టుకున్నా (రాజకీయాల్లోకి వెళ్లినా).. మళ్లీ సొంతగూటికి రావడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుడినీ గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం నాముందున్న లక్ష్యం. 1.4 కోట్ల మంది భారతీయుల కలల్ని నీలం రంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్