గతేడాది ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 296 మంది ప్రయాణికులు మృతి చెందారు. అప్పట్లో గ్రీన్ సిగ్నల్స్ పడటం, రైలు ట్రాక్ మారడం వంటి తప్పిదాలు జరిగాయి. సరిగ్గా అదే తీరులో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రాత్రి 8.27 సమయంలో ఈ రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.