బెంగాల్ న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టడంతో కాంచనింఘా ఎక్స్ప్రెస్ చివరి రెండు బోగీలు పట్టాలు తప్పి, దెబ్బతిన్నాయి. ఒక భోగీ గాల్లోకి లేచింది. అయితే వాటిలో ప్రయాణికులు లేరు. ఒకదాంట్లో ప్యాంట్రీ(క్యాంటీన్) ఉండగా మరోదాంట్లో లగేజ్ ఉంది. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ రెండు బోగీ
ల్లోనూ ప్రయాణికులు ఉండి ఉంటే మరణాల సంఖ్య భారీగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.