పడవ బోల్తా.. ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

73చూసినవారు
పడవ బోల్తా.. ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరోదా గ్రామ సమీపంలోని సీప్‌ నదిలో ప్రయాణికులతో నిండిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పడవలో దాదాపు 11 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం మోహన్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించాలని అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్